సమంత హీరోయిన్‌గా నటించిన `శాకుంతలం` చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. కానీ అవార్డు సాధించింది. తాజాగా ఇది కాన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

సమంత ప్రధాన పాత్రలో నటించిన `శాకుంతలం` చిత్రం ఆ మధ్య విడుదలైన నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి అరుదైన గుర్తింపు దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు వరించింది. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ విభాగంలో కాన్స్ అవార్డు రావడం విశేషం. `శాకుంతలం` చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లా ఈ ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డు దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ వెల్లడించింది. 

ఫ్రాన్స్ లో ఈ నెల 16 నుంచి 27 వరకు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌-2023 వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇండియన్‌ తారలు కూడా పాల్గొని సందడి చేశారు. మృణాల్‌ ఠాకూర్‌, ఐశ్వర్య రాయ్‌, శృతి హాసన్‌ వంటి కథానాయికలు ఇందులో పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. ట్రెండీ వేర్‌లో మెరిసి హైలట్‌గా నిలిచారు. ఇక ఈ వేడుక శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా అవార్డులను ప్రకటించారు. ఇందులో ఇండియాకి, మన తెలుగుకి చెందిన `శాకుంతలం` సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ విభాగంలో నీతా లుల్లాకి అవార్డు దక్కడం విశేషంగా చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే `శాకుంతలం` చిత్రంలో కాస్ట్యూమ్స్ కి మంచి పేరొచ్చింది. సినిమాలో `శకుంతల`గా సమంత, దుష్యంతుడిగా హీరో దేవ్‌ మోహన్‌, ఇతర ఆర్టిస్టులు వాడే కాస్ట్యూమ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా ఆడకపోయినా, దుస్తులు మాత్రం ఫేమస్‌ అయ్యాయి. చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అవార్డే రావడం విశేషం. ఇదిలా ఉంటే నీతా లుల్లా ఇప్పుడు పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న `బ్రో` చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా సంస్థ సైతం ఆమెకి అభినందనలు తెలియజేసింది. ఆమె తమ `బ్రో` సినిమాకి పనిచేయడం వల్ల తనకు మరింత గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్టు టీమ్‌ వెల్లడించింది. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే సమంత.. శకుంతలగా, దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించిన ఈ చిత్రానికి గుణ శేఖర్‌ దర్శకత్వం వహించారు. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ నేపథ్యంలో మైథలాజికల్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. గుణశేఖర్‌తోపాటు దిల్‌రాజు సినిమాని నిర్మించారు. సుమారు 50-60కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కనీసం ఐదు కోట్ల నెట్‌ని కూడా సాధించలేకపోయింది. డిజిటల్‌ పరంగానూ పెద్దగా రాలేదు. దీంతో ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.