Asianet News TeluguAsianet News Telugu

'శాకుంతలం' రిలీజ్ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్, సమంత ఏం చెప్పిందంటే

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రం.

Samantha Shaakuntalam movie officially postponed
Author
First Published Feb 7, 2023, 1:00 PM IST

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రం. పౌరాణిక చిత్రంగా దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నారు. 

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో నుంచి స్ఫూర్తి పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల పడ్డ కష్టాలుని కళ్ళకి కట్టినట్లు చూపించబోతున్నారు. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం ఫిబ్రవరి లోనే రిలీజ్ కావాల్సింది. ఇటీవల ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. 

ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మైయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత ఫుల్ ఎనెర్జీతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంది. కానీ అనూహ్యంగా ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శాకుంతలం చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయలేకున్నాం. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నందుకు చింతిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. 

దీనితో సమంత అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే పోస్ట్ పోన్ కి గల కారణాలు ప్రకటించలేదు. దీనిపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని, విఎఫెక్స్ పై ఫోకస్ చేస్తున్నారని.. హిందీలో థియేటర్స్ దొరకలేదని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే నిరాశలో ఉన్న అభిమానులకు సమంత ఒక మాట చెప్పింది. మీ ఎదురుచూపులకు ఈ చిత్రంతో తగ్గ ఫలితం ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నా అంటూ సమంత పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios