యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత సెటైర్లు వేసింది. పోస్టర్‌ని పట్టుకుని మరీ కామెంట్‌ చేసింది. మైక్‌ టెస్టింగ్‌ అంటూ మరీ ఆమె కామెంట్‌ చేయడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని తాజాగా సమంత విడుదల చేసింది. ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది సమంత. దీనికి `స్టాండప్‌ రాహుల్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

ఈ ఫస్ట్ లుక్‌ని పంచుకుంటూ `మైక్‌ టెస్టింగ్‌ 1.. 2.. 3 చెక్‌ చెక్‌.. రాజ్‌ తరుణ్‌ కూర్చుంది చాలు` అంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపింది సమంత. ప్రస్తుతం ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. మరోవైపు సమంత పెట్టిన కామెంట్‌ సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాతో మోహన్‌ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో రాజ్‌ తరణ్‌ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 

`జీవితంలో దేని గురించి ఆలోచించని ఓ వ్యక్తి చుట్టూ` ఈ కథ తిరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. నంద్‌కుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రాజ్‌తరుణ్‌ నటించిన `ఒరేయ్‌ బుజ్జిగా`, `పవర్‌ ప్లే` చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసితో ఉన్నాడు రాజ్‌తరుణ్‌.