దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు రాధారవి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కోలివుడ్ మొత్తం రాధారవికి వ్యతిరేకంగా మాట్లాడారు. 

నయనతార తనపై చేసిన వ్యాఖ్యలకు రాధారవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు సమంత సైతం గట్టి కౌంటర్ ఇచ్చింది. ''మిస్టర్ రాధారవి.. కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి. అందుకు మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్ హిట్ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్ కార్న్ తింటూ ఆశ్వాదించండి'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

దీనికి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉండగా.. రాధారవిని తన పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అలానే ఆయన్ని ఇకపై సినిమాల్లో తీసుకోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది.