అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. పాటలు, పోస్టర్లు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. సమంత ఏకంగా తన ట్విట్టర్ యూజర్ నేమ్ ని బేబీ అక్కినేనిగా మార్చేసుకుంది.

వీలైనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది సమంత. కొరియన్ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకి సినిమా నచ్చలేదని, అవుట్ పుట్ తో ఆయన సంతృప్తిగా లేరని నిన్న వార్తలు వినిపించాయి.

పలు వెబ్ సైట్లు ఈ వార్తని ప్రచురించడంతో సమంత వరకు విషయం వెళ్లిందట. దీంతో ఆమె తనకు బంధువైన సురేష్ బాబుకి పర్సనల్ గా మెసేజ్ చేసిందట. సినిమా అవుట్ పుట్ నచ్చలేదా..? ఏమైనా మార్పులు చేద్దామా..? అని ప్రశ్నించిందట.

దానికి అతడు అలాంటి ఇష్యూలేవీ లేవని చెప్పడంతో ఆమె రిలాక్స్ అయిందట. సురేష్ బాబు తన పీఆర్ టీమ్ ని పిలిచి ఇలాంటి రూమర్స్ రాకుండా చూసుకోమని చెప్పారట.