నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ తెలుగు రీమేక్‌లో  సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. అయితే అవుట్ ఫుట్ చూసుకున్న నిర్మాత సురేష్ బాబు కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసారట. ఈ మేరకు ఆయన దర్శకురాలు నందినీ రెడ్డి రీ షూట్ చేయమని ఆదేశించారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందో కానీ ఇప్పటిదాకా నందినీరెడ్డి కానీ, సమంత కానీ స్పందించలేదు. 

ఓ బేబీ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ...నాకు చాలా కాలంగా పూర్తి ఎంర్టైన్మెంట్  కథా చిత్రంలో నటించాలన్న ఆశ ఉంది. అది ఓ బేబీతో తీరుతుంది. చిత్రం ఆధ్యంతం నవ్వుకునేలా ఉంటుంది,ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకం కాబోతోంది. నా ప్రియమైన దర్శకురాలు నందిని రెడ్డి నాకు ఎంతో ఇష్టమైన పాత్రను ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. ఆమె ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. 

ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇందులో సమంత కొడుకుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట.  చిత్రం ఏమిటంటే...‘అత్తారింటికి దారేది, రాజుగారి గది 2’చిత్రాల్లో రావు రమేశ్‌ కూతురిగా సమంత యాక్ట్‌ చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు యంగ్‌ హీరో నాగశౌర్య కనిపిస్తారు.