నేను ఊ అంటావా పాటను ఒప్పుకున్నదే ఆ పాటలోని లిరిక్స్ నచ్చి. ఆడవాళ్లంటే కేవలం అందంగా కనిపించడానికే కాదు..
పుష్ప (Pushpa) సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా పాట ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఆ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి ఆడి పాడింది సమంత. ఈ పాట రిలీజ్ అవ్వగానే చార్ట్ బస్టర్ అయిపోయింది. నార్త్ బెల్ట్ లోనూ తెగ మార్మోగిపోయింది. విడాకుల తర్వాతే సమంత ఈ ఐటెం పాటలో నటించింది. అయితే ఇంకెప్పుడూ ఇలాంటి ఐటెం పాటల్లో అస్సలు నటించనని తేల్చి చెప్పేసింది సామ్.
తాజాగా ఆ పాటకు సంబంధించిన ఓ విషయాన్ని సమంత బయటపెట్టారు. ఆ పాట షూటింగ్‌లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో గుర్తు చేసుకున్నారు. సమంత మాట్లాడుతూ... రాజీ (ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలోని సమంత పాత్ర)కి ఆ పాత్రని పోలి ఉండడంతోనే ‘ఊ అంటావా‘ పాట చేయాలని అనుకున్నాను. మీ చుట్టూ ఎక్కువమంది లేకపోవడమే మంచి అనేది నా భావన. ఎందుకంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దరు. మంచి వైపు ఉన్న కోణం ఇది. అవతలి కోణం ఏంటంటే.. నేను తప్పులు చేయాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. నటిగా నేను ఆ కోణాన్ని అన్వేషించాల్సిన ప్రాంతం నుంచే ‘ఊ అంటావా‘ సాంగ్ చేయాలనే నిర్ణయం వచ్చింది. నా లైంగికత వల్ల ఎప్పుడూ అసౌకర్యంగానే ఉన్నాను. నేనెప్పుడూ పూర్తి సౌకర్యంగా కానీ, విశ్వాసంతో కానీ లేను. ఇది సరిపోదు, నేను అందంగా లేను, ఇతర అమ్మాయిల్లా కనిపించను అని అనుకొనే దానిని’’ అని సమంత పేర్కొన్నారు.
‘ఊ అంటావా’ పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై సమంత మాట్లాడుతూ.. ‘‘నా వరకు అది చాలా పెద్ద చాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి అసౌకర్యమైన, కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను. నేను ఊ అంటావా పాటను ఒప్పుకున్నదే ఆ పాటలోని లిరిక్స్ నచ్చి. ఆడవాళ్లంటే కేవలం అందంగా కనిపించడానికే కాదు.. వారి అందాన్ని బట్టే వారికి విలువ కడుతున్నారు అది చాలా తప్పు అని చెప్పడానికి ఆ పాటలో నటించాను. అయితే ఇలాంటి పాటల్లో నేను ఇక జీవితంలో నటించను’’ అని సమంత వివరించారు. పుష్ప 2లో మరోసారి ఇలాంటి పాట చేస్తారా? అన్న ప్రశ్నకు చేయబోనని స్పష్టం చేశారు.
