భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల కథని అపురూప ప్రేమ కావ్యంగా చూపించబోతున్నారు గుణశేఖర్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఇటీవలే త్వరలో ప్రమోషన్స్ మొదలవుతాయని గుణశేఖర్ అన్నారు. అన్నట్లుగానే నేడు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. శాకుంతలం చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే కాదు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రాన్ని నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

మోషనల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పురాణాల్లో చెప్పబడిన భారీ భవంతులు చూపించారు. బిజియం ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక సమంత.. శకుంతలగా దుశ్యంతుడి ప్రేమ కౌగిలిలో బందీగా ఉంది. రొమాంటిక్ గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ అదిరిపోయింది అనే చెప్పాలి. 

సమంత అందంగా కనిపిస్తూ ప్రేమ తన్మయత్వంలో మునిగితేలుతోంది. దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. గుణశేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్టు గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. 

చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న పౌరాణిక చిత్రం కావడం, సమంత నటిస్తుండడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రంలో సమంత ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు టాక్. 

YouTube video player