ఓ బేబీ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న సమంతకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రం, తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ప్రేమికుల మధ్య ఒకరినొకరు కొట్టుకునేంత చనువు ఉండాలని అలా లేకుంటే అది ప్రేమే కాదని సందీప్ వంగ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. 

ప్రేమ గురించి, మహిళల గురించి సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని సమంత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వివాదం మొత్తం కబీర్ సింగ్ చిత్రం నుంచే మొదలైంది. కబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ ని హీరో చెంపదెబ్బలు కొట్టడంపై ప్రశ్నించగా సందీప్ స్పందించాడు. అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు మాత్రం సమంత ఆ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. 

సమంత ఒకే అంశంపై మాట మారుస్తోందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీనిపై సమంత ట్విట్టర్ లో వివరణ ఇచ్చింది. సినిమా కథ నచ్చడం, కామెంట్స్ ని వ్యతిరేకించడం రెండూ వేరు వేరు అంశాలు. అర్జున్ రెడ్డి కథ నాకు నచ్చింది. కానీ ఆ చిత్రాన్ని అందరికి ఆపాదిస్తూ సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు నచ్చలేదు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కు సమంత సమాధానం ఇచ్చింది.