సమంతకు అంత ఇస్తున్నారు కాబట్టే టాక్ షో కి సై ?
సమంత హోస్టుగా 'సామ్ జామ్' అనే షోను రూపొందిస్తోంది.ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించమే కాకుండా ఓ బుల్లి టీజర్ ని రిలీజ్ చేసారు.ఈ నెల 13 నుంచి ఈ షోను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఇందుకోసం సమంతకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల వరకూ ఇస్తున్నట్లు టాక్. అంత పెద్ద ఎమౌంట్ ఇస్తున్నారు కాబట్టే ఆమె ఈ టాక్ షో ఓకే చేసిందని తెలుస్తోంది.
అక్కినేని వారి కోడలు, అందాల హీరోయిన్ సమంత ఇప్పుడు ఫుల్ టైమ్ హోస్టుగా మారింది. దసరా స్పెషల్‌గా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4లో పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించి అన్ని వర్గాల వారి నుంచి మంచి మార్కులు కొట్టేసిన నటి సమంత ఇప్పుడు ఫుల్‌టైం హోస్టుగా దుమ్మురేపనుంది . 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని 'ఆహా' అనేక ఎంటర్ట్నైమెంట్ కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సమంత హోస్టుగా 'సామ్ జామ్' అనే షోను రూపొందిస్తోంది.ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించమే కాకుండా ఓ బుల్లి టీజర్ ని రిలీజ్ చేసారు.ఈ నెల 13 నుంచి ఈ షోను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఇందుకోసం సమంతకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షల వరకూ ఇస్తున్నట్లు టాక్. అంత పెద్ద ఎమౌంట్ ఇస్తున్నారు కాబట్టే ఆమె ఈ టాక్ షో ఓకే చేసిందని తెలుస్తోంది.
సమంత మాట్లాడుతూ, ఈ షో చేయడం అన్నది తనకు ఒక కొత్త అనుభవమని చెప్పింది. అయితే, ఇది అనుకున్నంత ఈజీ జాబ్ కాదని కూడా పేర్కొంది. "హోస్టింగ్ చేయడం అనేది ఈజీ ఎంత మాత్రం కాదు. నిజం చెప్పాలంటే, దీంతో పోల్చితే, సినిమాలో నటించడమే ఈజీనేమో అనిపించింది. సామ్ జామ్ షో చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. ఈమధ్య బిగ్ బాస్ కి హోస్ట్ చేశాను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను.
సామ్ జామ్ టాక్ షోలో చిరంజీవి, అల్లు అర్జున్, విజరు దేవరకొండ, తమన్నా, రష్మిక సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలతో సమంత మాట్లాడనుంది. ఈ షోకి దర్శకురాలు నందిని రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బాగా పాపులర్ అయిన 'కాఫీ విత్ కరణ్' షోలాగా 'సామ్ జామ్' టాస్ షో ఉంటుందని తెలుస్తోంది. అయితే, సామ్ జామ్ కేవలం టాక్ షో మాత్రం కాదు. ఇందులో గెస్ట్ తో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. దీని ద్వారా టాలెంటును కూడా ఎంకరేజ్ చేస్తాం. మొత్తానికి ఇదొక కొత్త అనుభవం.. అనుభూతి కూడా' అని చెప్పింది సమంత.