అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ముల దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక సమంత ఇటీవల ఓ బేబీ చిత్రంతో విజయం అందుకుంది. అక్కినేని ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. ఏఎన్నార్, నాగార్జున ఆ తర్వాత వారి వారసత్వాని నాగ చైతన్య, అఖిల్ కొనసాగిస్తున్నారు. ఇటీవల నాగచైతన్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. 

నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సాగర్ అనే వీరాభిమాని సింహాచలం ఆలయంలో వెయ్యి మెట్లని మోకాళ్లపై ఎక్కాడు. నాగ చైతన్య సంతోషంగా ఉండాలని తాను మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అతడి అభిమానానికి ఆశ్చర్యపోయిన సమంత స్పందించింది. 

సాగర్ కు ధన్యవాదాలు తెలిపింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. అతడి అభిమానానికి మాటలు రావడం లేదని సమంత తెలిపింది. సాగర్ తమని కలవాలని కోరింది. 

నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రంకు కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.