హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్య కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల 'మజిలీ' సినిమాతో సక్సెస్ అందుకున్న సమంత తన తదుపరి సినిమా షూటింగ్ కోసం పోర్చుగల్ కి వెళ్లారు.

అక్కినేని నాగార్జున నటిస్తోన్న 'మన్మథుడు 2' సినిమాలో సమంత అతిథి పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ కోసం నాగార్జున, అమలతో కలిసి సమంత పోర్చుగల్ వెళ్లారు. సమంత పాత్ర చిత్రీకరణ అయిపోయిన తరువాత స్పెయిన్ కు వెళ్లింది. అయితే నాగచైతన్య మాత్రం ఇక్కడే ఉన్నారు. 

ఈ క్రమంలో సమంత తన భర్త కోసం ఎదురుచూస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. బాధగా చూస్తున్న ఓ స్కెచ్ ఫోటోని పోస్ట్ చేస్తూ దానిపై 'నా చైతు కోసం ఎదుచూస్తున్నాను' అని పేర్కొన్నారు. 'మన్మథుడు 2' చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.