టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి తన తల్లితో మనస్పర్ధలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. చెన్నైకి చెందిన సమంత.. నాగచైతన్యని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయింది.

అయితే సమంతకు తన తల్లితో మనస్పర్ధలు తలెత్తాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఈ విషయంపై సమంత పెద్దగా స్పందించింది లేదు. కానీ తాజాగా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుందో ఏమో సోషల్ మీడియాలో మదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది. తన తల్లితో ఉన్న అనుబంధాన్ని వివరించింది. మదర్స్ డే ని ఒక సందర్భంగా తీసుకొని తన తల్లితో ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చింది.

తన తల్లి ప్రార్ధనలో మ్యాజిక్ ఉంటుందని ఇప్పటికీ అది నమ్ముతానని అంది. చిన్నతనంలోలానే ఇప్పటికీ తనకోసం ప్రార్ధన చేయమని అమ్మను కోరుతానని చెప్పింది. అమ్మ ప్రార్ధన చేస్తే అంతా సరి అయిపోతుందని చెప్పుకొచ్చింది.

ఇక్కడ ప్రత్యేకమేమిటంటే.. అమ్మ తన కోసం ఎప్పుడూ ప్రార్ధన చేసుకోలేదని చెప్పింది. దైవం స్థానంలో ఉండేది అమ్మేనని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' సినిమాలో నటిస్తోంది.