సమంత అక్కినేని తెలివితేటలు తన కెరీర్ కోసమే కాకుండా... ఫ్యామిలీ మెంబర్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగిస్తున్నట్లు ఉంది. అందుకే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మరిది అఖిల్ కోసం సూపర్ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ కోసం ఓ క్రేజీ ప్రాజెక్ట్ సమంత సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. 

సమంత ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ట్రైలర్ లో సమంత లుక్ సిరీస్ పై అంచనాలు పెంచేదిగా ఉంది. ఫిబ్రవరి 12నుండి అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ మాన్ 2 సిరీస్ స్ట్రీమ్ కానుంది. కాగా ఈ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది సమంత. 

కాగా ఈ సిరీస్ దర్శకులైన రాజ్ అండ్ డీకే ఓ స్క్రిప్ట్ సమంతకు నేరేట్ చేశారట. ఐతే ఈ ప్రాజెక్ట్ తమ మరిది అఖిల్ కి చక్కగా సరిపోతుందని, అతనితో ఈ మూవీ చేయాలని సిపారస్ చేశారట. తెలుగు దర్శకులైన రాజ్ అండ్ డీకే సమంత ప్రపోజల్ పై సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవని అంటున్నారు. 

నాగార్జున వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు. ఒక్క హిట్ కూడా దక్కక ఒత్తిడిలో ఉన్న అఖిల్ ని హిట్ తో బయటపడేసే ప్రయత్నాలు సమంత చేస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో నటిస్తున్నారు.