బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో సమంత క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. మజిలీ - ఓ బేబీ సినిమాలతో స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఓ బేబీ సినిమా ఇప్పుడు తమిళ్ లో కూడా రిలీజ్ కాబోతోంది. అయితే సమంతకి ఈ మధ్య అక్కడ పెద్దగా సక్సెస్ లు దక్కలేవు. 

చివరగా వచ్చిన సూపర్ డీలక్స్ పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ఊహించినంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక తెలుగులో ఓ బేబీ మాత్రం సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దాదాపు 40కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాను తమిళ్ లో డబ్ చేసి అదే పోరుతో ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నారు. 

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ బాబు చిన్న ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. లక్ష్మి - నాగ శౌర్య - రావు రమేష్ - అడివి శేష్ వంటి స్టార్ నటీనటులు ముఖ్యపాత్రలో కనిపించారు. మరి తెలుగులో సక్సెస్ అయిన ఓ బేబీ కోలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.