కొత్త బిజినెస్ మొదలు పెట్టిన సమంత, సినిమాలు వదిలేస్తుందా..?

సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగిన హీరోయిస్ సమంత.. బిజినెస్ లో కూడా స్టార్ గా మారబోతోంది. ఇప్పటికే కొన్ని వ్యాపారాలు చేస్తున్న ఈబ్యూటీ.. తాజాగా మరో బిజినెస్ లోకి దిగినట్టు తెలుస్తోంది. 

Samantha New Business Venture.. Is She Shifting Focus from Movies JMS

దాదాపు ఏడాదిన్నరకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత. అనారోగ్యంతో బాధపడిన ఈబ్యూటీ.. తనకు వచ్చిన మైయోసైటిస్ కు ట్రీట్మెంట్ చేయించుకుంది. పని ఒత్తిడి తగ్గించుకుని.. ఫారెన్ ట్రిప్పుట్లో కూల్ అయ్యింది సమంత. చాలా కాలంగా అసలు లైమ్ లైట్ లో లేని సమంత.. రీసెంట్ గా మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. నాగచైతన్య రెండో పెళ్లితో.. మళ్ళీ వార్తల్లోనిలుస్తోంది సమంత. ఈక్రమంలో సమంతకు సబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. 

ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతుంది సమంత. అయితే లాంగ్ గ్యాప్ తరువాత సమంత సినిమాల కంటే కూడా బిజినెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గతంలోనే కొన్ని బిజినెస్ లు చేస్తూ వచ్చిన శ్యామ్ కు .. ఆన్ లైన్ గార్మెంట్, జ్యూవ్వెల్లరీబిజినెస్ లు ఉన్నట్టు సమాచారం. అంతే కాదు మరికొన్ని బిజినెస లలో పార్టన్ గా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.   ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్.. పలు బిజినెస్ లలో సమంత పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో కొత్త బిజినెస్ లో పెట్టుబడులు పెట్టింది.

 

సమంత తాజాగా స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్ తో కలిసి సమంత పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంజైజ్ ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి సమంత ఈ విషయాన్ని తెలిపింది. దీంతో పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

సౌత్ సినిమాలో స్టార్ గా వెలుగు వెలిగింది సమంత. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఆల్ మోస్ట్ సీనియర్, జూనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. నాగచైతన్యతో సీక్రేట్ గా ప్రేమాయణం నడిపించిన ఈ బ్యూటీ.. ఏడేళ్ల తరువాత పెళ్ళి పీటలెక్కింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే.. మనస్పర్ధల కారణంగా వీరు విడిపోయారు. ఇక సమంత తన సినిమాలతో తాను బిజీ అయిపోయింది. ప్రస్తుతం బిజినెస్ విమెన్ గా ఎదగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios