వివాహం జరిగిన తరువాత సమంత కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 'యూటర్న్' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా దర్శకురాలు నందిని రెడ్డితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొదలై వారం రోజులు అవుతోంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ రవీంద్రభారతిలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న నాగశౌర్య సైతం షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో సమంత డ్యుయల్ రోల్ లో కనిపించనుంది. ఇంకా ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సునీత తాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.