యువ హీరోయిన్స్, నార్త్ సైడ్ బ్యూటీల డామినేషన్ ఎక్కువవడంతో సీనియర్ టాలీవుడ్ బేబీలకు అవకాశాలు తగ్గుతున్నాయి. అయితే ఎవరి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం తనదైన శైలిలో అవకాశాలను అందుకుంటూ మంచి పోటీని ఇస్తోంది. 

ఇకపోతే ఈ ఏడాది రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సమంత యూ టర్న్ సినిమాతో నిర్మాతగానే కాకుండా ప్రయోగల హీరోయిన్ అంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక నెక్స్ట్ అమ్మడు డ్యూయల్ రోల్ లో కనిపించనుంది. ఎవరు ఊహించని విధంగా అమ్మమ్మ పాత్రలో అలాగే యువ సమంతగా రెండు విభిన్న షేడ్స్ లలో అలరించనుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ ప్రయోగాత్మక చిత్రం కొరియన్ మూవీకి రీమేక్ గా వస్తోన్న సంగతి తెలిసిందే.  

ఈ సినిమాకు 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో సమంత నటన సరికొత్త ఫీల్ ను కలిగిస్తుందని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు నందినిరెడ్డి స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.