Asianet News TeluguAsianet News Telugu

త్రిష ఆఫర్ కొట్టేసిన సమంత, రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్ బ్యూటీ.

దాదాపు ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అయ్యింది సమంత. త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతోందట. అయితే తాను చేయబోయే సినిమాపై ప్రస్తుతం డిఫరెంట్ టాక్ నడుస్తోంది. 
 

Samantha Movie With Salman Khan In the Bull Movie JMS
Author
First Published Jan 3, 2024, 12:37 PM IST

ఏజ్ పెరుగుతుననా కొద్ది.. డిమాండ్ తగ్గని హీరోయిన్లలో త్రిష, నయనతార, సమంతలాటి హీరోయిన్లు ఉన్నారు. అందులో ముఖ్యంగా త్రిష 40 ఏళ్ళ వయస్సులో  ముందు వరసలో ఉంది. రీసెంట్ గానే హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది త్రిష. వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఎప్పుడైతే పొన్నియన్ సెల్వన్ సినిమా వచ్చిందో.. అప్పటి నుంచి త్రిష దశ మారిపోయింది. ఇక ఇప్పుడు త్రిష తో పాటు సమంతకు సబంధించిన ఓ కాంబో న్యూస్ వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం రెస్ట్ లో ఉందిసమంత. సినిమాలకు ఏడాది పాటు విరాపం ప్రకటించి తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అంతే కాదు నచ్చిన ప్రదేశాలు చుట్టేస్తూ..హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక త్వరలో ఆమె సినిమాలు స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ మూవీతో ఆమె  రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే త్రిషకు, సమంత రీ ఎంట్రీకి సబంధం ఏంటీ అని డౌట్ రావచ్చు.  ఇద్దరికీ సంబంధించిన ఒక బాలీవుడ్ టాక్ ఆసక్తికరంగా ఉంది. 

Samantha Movie With Salman Khan In the Bull Movie JMS

సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ భారీ ఎత్తున్న ‘ది బుల్’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఓ రెండు మూడు రోజుల్లో రానుంది. 2025 రంజాన్ పండగని లక్ష్యంగా పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈహూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని కసర్తు చేశారు టీమ్. అయితే ఈమధ్యబాలీవుడ్ లో సౌత్ హవా ఎక్కువైపోయింది. షారుక్ కూడా ఇలానే హిట్లు కూడా కొట్టాడు. దాంతో సల్మన్ సరసన సౌత్ హీరోయిన్ ను సెట్ చేయాలి అని అనుకున్నారట. 

దాంతో ముందుగా కండల వీరుడికి జోడిగా త్రిషను అనుకున్నారు. కానీ ఆమె అజిత్ కొత్త సినిమాతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న  విశ్వంభరకు కమిట్ మెంట్ ఇచ్చేసింది.దాంతో ఆమె దగ్గర సల్మాన్ కోసం డేట్లు లేవు. దాంతో ఇష్టం లేకున్నా.. ఈసినిమాను వదులుకోవల్సి వచ్చిందట. ఈవిషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక త్రిష ఈమూవీ నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానంలో సమంతాని తీసుకునే ప్రతిపాదన జోరుగా సాగుతోందని తెలిసింది. శాకుంతలం డిజాస్టర్, ఖుషి ఎబోవ్ యావరేజ్ ఫలితాలు వచ్చాక చికిత్స కోసం కెరీర్ కు బ్రేక్ తీసుకున్న సామ్ త్వరలో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్లతో మొదలుపెట్టి మెల్లగా కథలు వింటుంది. అయితే ఇప్పటికే ఈ కథ సామ్ దగ్గరకు వెళ్ళందని.. ది బుల్ కి ఆమె  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios