అక్కినేని వారి కోడలు సమంత సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా కోట్లు సంపాదించిన సమంత, అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తుంది. మరోమారు సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమంత సౌత్ ప్రేక్షకుల సినిమా టేస్ట్ గురించి కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సమంత మాట్లాడుతూ... బాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి వెనుకాడరు. అలాగే అక్కడ ప్రేక్షకులు తమ అభిమాన నటులు విలన్ రోల్స్ చేసినా అంగీకరిస్తారు. ఐతే సౌత్ ఇండియాలో ప్రేక్షకులు దీనికి ఒప్పుకోరు అన్నారు. హీరోలు, హీరోయిన్స్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ప్రేక్షకులకు నచ్చదు. వారికున్న ఇమేజ్ కి భిన్నంగా చూపిస్తే అంగీకరించరు అన్నారు. 
 
 సమంత ఆరోపించినట్లు ఇక్కడ ప్రేక్షకులు హీరోలు నెగెటివ్ రోల్స్ చేస్తే స్వీకరించరు అనేది పూర్తి స్థాయిలో నిజం కాదు. సౌత్ ఇండియాలో అనేకమంది హీరోలు విలక్షణమైన పాత్రలు చేస్తున్నారు. వారిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.  విజయ్ సేతుపతి హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే... ఇతర హీరోల సినిమాలలో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఆయన నెగెటివ్ షేడ్ రోల్ చేసిన విక్రమ్ వేదా పెద్ద విజయం సాధించింది. అలాగే మాస్టర్ మూవీలో విజయ్ కి ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నాడు ఆయన. ఇక హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని దశాబ్దాలు అలరించిన జగపతిబాబు ఇప్పుడు స్టార్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. వీరితో పాటు కన్నడ పరిశ్రమకు చెందిన ఉపేంద్ర, సుదీప్  సోలో హీరోలుగా నటిస్తూనే, విలన్స్ గా కూడా నటిస్తున్నారు. 
 
 
కాబట్టి సౌత్ ఇండియాలో కూడా హీరో ఇమేజ్ కలిగిన నటులు విలన్ రోల్స్ చేస్తున్నారు.  కాకపోతే బాలీవుడ్ రేంజ్ లో మనవాళ్ళు వైవిధ్యమైన పాత్రలు చేయకపోవచ్చు. కాగా సమంత కూడా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్  త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో పాకిస్థానీ అమ్మాయిగా సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని సమాచారం.