సమంత రాను రాను సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా మారుతోంది. అన్ని విషయాలని సమంత సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ లు పెడుతోంది.
సమంత రాను రాను సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా మారుతోంది. అన్ని విషయాలని సమంత సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ లు పెడుతోంది. ఆమె చేస్తున్న కొన్ని పోస్ట్ లు పరోక్షంగా ఉంటున్నాయి. ఈ అంశాన్ని పక్కన పెడితే బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలని విష్ చేయడం లో కూడా సమంత యాక్టివ్ గా మారింది.
తాజాగా సామ్ ఒక ఆసక్తికరమైన వార్తపై స్పందించింది. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ 2000 ప్రారంభంలో బ్లాక్ బెర్రీ ఫోన్స్ కి ఉండే క్రేజే వేరు. సెలెబ్రిటీలు, ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువగా బ్లాక్ బెర్రీ ఫోన్స్ నే ఉపయోగించేవారు. ఇప్పుడు ఐఫోన్స్ హవా సాగుతోంది అనుకోండి. అప్పట్లో మాత్రం బ్లాక్ బెర్రీదే హవా.
స్మార్ట్ ఫోన్స్ పెరిగాక బ్లాక్ బెర్రీ ఫోన్స్ క్రమంగా అంతరించిపోతూ వచ్చాయి. ఇటీవల ఆ సంస్థ సంచలన విషయాన్ని ప్రకటించింది. జనవరి 4 నుంచి బ్లాక్ బెర్రీ ఫోన్స్ సర్వీసులని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి నాలుగు నుంచి బ్లాక్ బెర్రీ ఓఎస్ లు పనిచేయడం లేదు. అవి ఇకపై డెడ్ డివైజ్ లతో సమానం. దీనితో బ్లాక్ బెర్రీ శకం అంతటితో ముగిసినట్లు ఐంది.

ఈ వార్త తెలియగానే సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'ఎందుకో తెలియదు.. ఈ వార్త నన్ను బాధిస్తోంది' అంటూ సామ్ కామెంట్ పెట్టింది. సమంత మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్లాక్ బెర్రీ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బెర్రీ మొబైల్స్ తో తమకున్న మెమొరీస్ ని షేర్ చేసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సామ్ సూపర్ బిజీగా మారుతోంది.సమంత రీసెంట్ గా పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ లో చిందులేసింది. అలాగే యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో సామ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
