`మ్యారేజ్‌ తర్వాత నాకు సినిమా అవకాశాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. హీరోయిన్‌గా ఛాన్స్ లు వస్తాయనుకోలేద`ని అంటోంది సమంత. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్న సమంత.. ప్రేమించి అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మ్యారేజ్‌ జరిగి మూడేళ్ళు పూర్తయ్యింది. ఆ తర్వాత `మహానటి`, `రంగస్థలం`, `సూపర్‌ డీలక్స్`, `ఓ బేబీ`, `జాను` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్‌ బెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. 

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మ్యారేజ్‌ తర్వాత సినిమాలు చేస్తానని అనుకోలేదట. `నిజంగా నాకు అదృష్టం ఎక్కువే. పెళ్ళి తర్వాత కూడా నేను వరుసగా మంచి చిత్రాల్లో కూడా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోవాలనో నేనేం ప్లాన్‌ చేయలేదు. అదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. 

మ్యారేజ్‌ తర్వాత `రంగస్థలం` వంటి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా `మహానటి`, `ఓ బేబీ` వంటి చిత్రాలు వచ్చాయి. ఇంకా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయ`ని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది `జాను` చిత్రంలో నటించిన సమంత  ఆ తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయలేదు. దీంతో ఇక ఆమె సినిమాలు మానేసినట్టేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.