సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీమాన్ 2 విడుదల తేదీ ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. విశేష ఆదరణ పొందిన ఫ్యామిలీమాన్వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ లక్కీ లేడీ సమంత ఈ సిరీస్ లో నటించడం మరో విశేషత. ఫ్యామిలీమాన్ 2 ద్వారా సమంత డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత పాత్రపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. సమంత పాకిస్థాన్ కి చెందిన అమ్మాయిగా కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. 

కాగా ఫ్యామిలీ మాన్ 2 ఫిబ్రవరి 12ను ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేయడం జరిగింది. చాలా కాలంగా వెండితెరపై మిస్సైన సమంతను డిజిటల్ లో చూడడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. సమంత పాత్రపై కూడా అనేక అంచనాలు నెలకొన్న నేపధ్యంలో సిరీస్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించగా కృష్ణ డి కె అండ్ రాజ్ నిడిమోరు తెరకెక్కించారు. 

ఇక హోస్ట్ గా సామ్ జామ్ టాక్ షో నిర్వహిస్తున్న సమంత, శాకుంతలం అనే మూవీ ప్రకటించారు. దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుండగా భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు. అలాగే ఓ తమిళ చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.