నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత సమాజానికి సందేశమిచ్చారు. ముఖ్యంగా ఆమె మహిళలను ఉద్దేశించి ఓ ఇన్‌స్పైరింగ్‌ పోస్ట్ పెట్టారు. `మార్పు మనతోనే మొదలవ్వాల`ని చెప్పింది. `మన స్థాయి, విలువ ఏంటోతెలుసుకునే తరుణం వచ్చింది. మన అర్హతకు తక్కువగా మనం ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నన్ను నేఉన మరింత నమ్మాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఛాలెంజ్‌చేసుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ఛాలెంజ్‌  చేయమని అడుగుతున్నా. నీలో నుంచి సాధికారిత రావాలి. ఆ మార్పు నీతోనే స్టార్ట్ అవ్వాలి` అని పేర్కొంది సమంత. 

ఈ మేరకు ఆమె ఓ వైట్‌ షర్ట్ ధరించిన ఫోటోని పంచుకుంది. ఇందులో పై రెండు బటన్స్ తీసేసి అబ్బాయి తరహాలో పోజ్‌ ఇచ్చింది సమంత. మహిళా దినోత్సవం సందర్భంగా మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనేసందేశాన్నిచ్చింది. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాల్లో బిజీ అవుతుంది సమంత. ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకుడు. దీంతోపాటు తమిళంలో `కాదు వాక్కుల రెండు కాదల్‌` చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తుంది. దీనికి నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ దర్శకుడు.

మరోవైపు అద్భుతమైన డాన్స్ వీడియోని పంచుకుంది సమంత. ఇందులో ఓ యూనిక్‌ డాన్స్ స్టెప్‌ని వేసింది. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ తాను ఇలా చేసేలా చేశాడని పేర్కొంది. తనకు అనుషా స్వామి తనచేత ఇలా చేయించిందన్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీన్ని ఒక మిలియన్స్ కి పైగా నెటిజన్లు తిలకించారు.