Asianet News TeluguAsianet News Telugu

నువ్విక్కడ లేకున్నా భయంగా ఉంది.. నాపై అంత అధికారం ఎవరిచ్చారు, సమంత పోస్ట్ వైరల్

విడాకుల అనంతరం సమంత తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసింది. చైతు కూడా తన నెక్స్ట్ మూవీ షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు.

Samantha comments on her Gym trainer goes viral
Author
Hyderabad, First Published Oct 18, 2021, 11:05 AM IST

సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం అందరికి ఊహించని షాక్ గా మారిపోయింది. గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలని నిజం చేస్తూ చైతు, సమంత విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి ఎన్నోన్నో కారణాలు వినిపించాయి. అయితే అవి ఊహాగానాలు మాత్రమే. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. 

ఇదిలా ఉండగా విడాకుల అనంతరం Samantha తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసింది. చైతు కూడా తన నెక్స్ట్ మూవీ షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. వీరిద్దరూ సైలెంట్ అయిపోయినప్పటికీ సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ మాత్రం ఆగడం లేదు. 

సమంత స్టైలిస్ట్ గా పనిచేసిన Preetham Jukalker వల్లే చైసామ్ మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.దీనిని ఖండిస్తూ సమంత ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది. ప్రీతమ్ కూడా ఈ అసత్య ప్రచారంపై తీవ్రంగా స్పందించాడు. సమంత తనకు అక్క లాంటిది అని క్లారిటీ ఇచ్చాడు. సమంతతో తన రిలేషన్ గురించి తప్పుడు ప్రచారం జరుగుతున్నా Naga Chaitanya ఖండించకపోవడం పట్ల ప్రీతమ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Samantha comments on her Gym trainer goes viral

ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో పరోక్షంగా వ్యాఖ్యలతో చేస్తున్న పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ సమంత తన జిమ్ ట్రైనర్ స్నేహ దేషు  గురించి చేసింది. 

'నీకు నాపై ఇంత అధికారం ఎలా వచ్చింది. స్నేహ దేషు.. నువ్విక్కడ లేకున్నా నాకు భయంగా ఉంది. వేరొకరి కోసం అయితే 30 కిలోల డంబెల్ నేను అస్సలు ఎత్తను. నీకోసం చేయాల్సి వస్తోంది. ఒకసారి అంటూ చూడండి. ఆ డంబెల్ బా బరువులో సగం ఉంది' అంటూ సమంత జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలు పోస్ట్ చేసింది. ఎంతో శ్రమిస్తూ సమంత 30 కిలోల డంబెల్ ని ఎత్తుతోంది. 

Also Read: శ్రీవారి సేవలో మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాలు అందలేదంటూ కామెంట్స్

సమంత రెగ్యులర్ గా జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉంటుంది. Shaakuntalam చిత్రం తర్వాత సమంత కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. శాకుంతలం చిత్రం పౌరాణిక గాధతో తెరకెక్కుతోంది. గుణశేఖర్ దర్శకుడు. ఇక విడాకుల తర్వాత సమంత తొలి చిత్రానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. జ్ఞానశేఖర్ అనే డెబ్యూ దర్శకుడితో సమంత కొత్త చిత్రం ఉండబోతోంది. డ్రీమ్ వారియర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios