ఇప్పుడు సమంత వారికి లక్ష్మి దేవిలా ఒక మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మజిలీ సినిమా సక్సెస్ లో ఆమె పాత్ర చాలానే ఉంది.
అక్కినేని హీరోలు హిట్టు చూసి చాలా కాలమవుతోంది. కోడలు సమంత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటుంటే హీరోలంతా వరుస ప్లాపులతో సతమతమయ్యారు. అయితే ఇప్పుడు సమంత వారికి లక్ష్మి దేవిలా ఒక మంచి సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మజిలీ సినిమా సక్సెస్ లో ఆమె పాత్ర చాలానే ఉంది.
రారొండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత యుద్ధం శరణం - శైలజా రెడ్డి అల్లుడు - సవ్యసాచి వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అంతకుముందే సమంత చైతుకి తనద్వారా ఒక మంచి హిట్టివ్వాలని నిర్ణయం తీసుకుంది. కథల కోసం వెతుకుతున్న తరుణంలో నిన్నుకోరి దర్శకుడు చెప్పిన మజిలీ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమా స్టార్టింగ్ టూ ఎండింగ్ సమంత ప్రతి విషయంలో కేర్ తీసుకుంది. తనకు సంబందించిన సీన్స్ కాకున్నా షూటింగ్ లో ఉంటూ దర్శకుడితో ప్రతి సీన్ గురించి డిస్కర్స్ చేసిందట. సీన్ లో తేడా కొడితే వెంటనే దర్శకుడితో మరోసారి రీ షూట్ చేయించిందట. అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే నేడు సమంత మజిలీ సినిమాతో భర్తకే కాకుండా అక్కినేని ఫ్యామిలీ కి కూడా మంచి హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
అఖిల్ - నాగ్ గత సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా మజిలీ తో అమ్మడు అక్కినేని ఫ్యామిలిలో ఒక పెద్ద పండగ తెచ్చింది.
