Asianet News TeluguAsianet News Telugu

22 నెలల తరువాత సమంత బ్యాక్ టు వర్క్.. ఏం చేస్తోందంటే..?

మొత్తానికి మళ్ళీ పని మొదలు పెట్టింది సమంత. ఏడాది రెస్ట్ అని చెప్పి  హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇక తాజాగా తన పెండింగ్ పనులు చక్కబెట్టే పనిలో మునిగిపోయింది. 

Samantha Back to work After 22 Months Starts Citadel Dubbing JMS
Author
First Published Jan 31, 2024, 7:35 AM IST

ఖుషీ సినిమా ప్రమోషన్ల తరువాత సమంత సినిమాలకు గ్యాప్ ఇస్తూ ప్రకటన చేసింది. ఏడాదిపాటు తాను యాక్టీవ్ గా ఉండనని నిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెల్త్ కండీషన్ చూసుకోవడంతో పాటు.. ట్రీట్మెంట్ పై ఫోకస్ చేయాలని, అలాగే తన బిజినెస్ లపై కూడా ఫోకస్ చేయాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు అప్పట్లో ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి సంమంత తనకు ఉన్న మయోసైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ.. తనకు నచ్చన టూర్లకు వెళ్తూ.. స్నేహితులతోసరదాగా గడుపుతూ.. తన బిజినెస్ లను ఓ రూట్ లో పెట్టి.. సినిమాల వైపు చూడకుండా గడిపేసింది. 

ఏడాది పాటు అంటూ.. చెప్పిన ఈ బ్యూటీ..సినిమా పనులకుదూరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయాన్ని తానే స్యయంగాప్రకటిస్తూ.. తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేసింది బ్యూటీ. బ్యాక్ టు వర్క్ అంటూ పోస్ట్ పెట్టిన సమంత.. 22 నెలల తరువాత ఇలా అంటూ తాజాగా పోస్ట్ పెట్టింది. అయితే ఈ ఖాళీ టైమ్ లో సమంత  ఓ సినీ నిర్మాణ సంస్థ కూడా స్థాపించింది.

సమంత పని మొదలు పెట్టింది కాని.. ఆమెకు ప్రస్తుతం సినిమాలేవి లేవు..కాని గతంలో తాను నటించి సిటడియోల్ వర్క్ మాత్రం పెండింగ్ లో ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే ఓ సిరీస్ చేసింది సామ్. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఇది తెరకెక్కిందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది. సిరీస్ షూటింగ్ అయిపోయినా సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది.

 

తాజాగా ఈ సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత. సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత. అలాగే రాజ్ & డీకే టీంతో ల్యాప్ టాప్ లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలని కూడా షేర్ చేసింది సమంత. ఈ ఫోటోలని షేర్ చేస్తూ 22 నెలల తర్వాత ఈ ప్రాజెక్టు రెడీ అయింది అని పోస్ట్ చేసింది.క గతంలో వీరి డైరెక్షన్ లో వచ్చి హిట్ అయిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో కూడా సమంత కనిపించింది.  ఇక ఈ సిటాడెల్ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో  స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, రొమాంటిక్ గా ఈసిరిస్  ఉండనున్నట్టు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios