సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..అదే సమయంలో తన ఫిట్నెస్ విషయంలోనూ ఆమె చాలా అలర్ట్ గా ఉంటుంది. ఆ విషయం మనకు తెలియటానికి అన్నట్లుగా తన ఫిట్ నెస్‌‌కు సంబందించి  ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూంటుంది. గతంలో వర్కౌట్స్ చేస్తూ.. అటో పది కేజీలు, ఇటో పది కేజీల బరువును మోస్తూ.. జిమ్ సూట్‌లో అదరగొట్టింది. తాజాగా మరో సారి వీడియోని విడుదల చేసింది. ఇనిస్ట్రాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు చూడవచ్చు. వీడియోలో సమంత సూపర్ ఫిట్‌గా కనిపిస్తూ ఫిట్‌నెస్ ప్రియులను, అభిమానులనూ ఆకట్టుకుంటుంది. ఇంకెందుకాలస్యం.. వీడియో ఎలా ఉందో చూసెయ్యండి మరి..

దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్.. వావ్ సమంత అదిరింది అని అంటున్నారు. అంతేకాదు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఫిట్ గా ఉండటానికి ఇంత కష్టపడాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు

కెరీర్ విషయానికి వస్తే ఈ అక్కినేని వారి కోడలు ‘‘సామ్ జామ్’’ షో తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ఆర్గానిక్ పార్మింగ్ చేస్తూ వాటి వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఇప్పుడు  డైట్ వర్కవుట్స్ తో పాటు శారీరక వర్కౌట్స్ స్టార్ట్ చేసిన సామ్, ఆ విభాగంలో నిపుణుడైన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తుంది.  

. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా చేయాల్సీవుండగా.. ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. దీంతో సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట.  ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట. ఈ సినిమాతో పాటు సమంత కన్నడ సినిమా దియాను తెలుగులో రీమేక్‌ చేయనుందట.