అనుష్క, సమంత, లక్ష్మి మంచు…అలా వరస పెట్టి మన తెలుగు హీరోయిన్లు భక్తి మార్గంలో పడుతున్నారు. సమంత రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తోంది. రకుల్ కూడా ఈ మధ్యనే  వీరితో చేరింది.  లక్ష్మి మంచు కొన్నాళ్లుగా గుళ్ళు,గోపురాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది.శివరాత్రి పురస్కరించుకొని కోయంబత్తూర్ వెళ్లారు సమంత, రకుల్, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో వీరంతా పాల్గొన్నారు.

ఇక మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌గా, అవి భ‌క్తుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.   గురువారం (మార్చి 11) రాత్రి నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో మంగ్లీ పరమశివుడి పాటలు  పాడ‌గా, వాటికి ప‌ర‌వ‌శించిన భ‌క్తులు  భ‌క్తి పార‌వ‌శ్యంతో డ్యాన్స్‌లు చేశారు. సద్గురు కూడా నటరాజు భంగిమల్లో నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహం నింపారు. 

కెరీర్ విషయానికి వస్తే ...సమంత ఈ నెలలో ‘శాకుంతలం’ షూటింగ్ మొదలు పెడుతుంది. రకుల్ ప్రీతి సింగ్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ యమా బిజీగా ఉంది.