బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన తల్లి సుశీలా చరక్ కి కొత్త సంవత్సరం కానుక ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. డిసంబర్ 27న 53వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న సల్మాన్ ముంబైలోని పాన్వెల్ ప్రాంతంలో ఉన్న తన గెస్ట్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ''నాలుగు రోజుల క్రితం అమ్మ నన్ను ఓ విషయం అడిగింది. నీకు ఇప్పుడు ఫోర్ ప్యాక్ శరీరాకృతి ఉంది.

వచ్చే ఏడాది కానుకగా నాకు సిక్స్ ప్యాక్ కావాలని అడిగింది. నాకు ఇది చాలా చిన్న విషయం. అమ్మ కోరిక కోసం కష్టపడుతున్నాను. వర్కవుట్స్ చేస్తున్నాను. డైట్ పూర్తిగా మార్చేశాను. ఉదయం, సాయంత్రం జిమ్ చేస్తున్నాను.

గంట పాటు పరుగు తీస్తున్నాను. కాబట్టి అమ్మకి నేనిచ్చే న్యూయర్ కానుక సిక్స్ ప్యాక్'' అంటూ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాదిలో సల్మాన్ ఖాన్ మూడు సినిమాలతో బిజీ కానున్నాడు.