సినిమా షూటింగ్‌ కోసం బయలు దేరాడు సల్మాన్‌. రెడీ అయి తన సిబ్బందితో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్ కి వెళ్లాడు. ఎయిర్‌పోర్ట్ చేరుకున్న సల్మాన్‌ మాస్క్ పెట్టుకుని లోపలికి బయలు దేరాడు. గేట్‌ దగ్గరకు వెళ్లగానే ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ సల్మాన్‌ ఖాన్‌ని ఆపాడు. 

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కి ఎయిర్‌పోర్ట్ లో నిలిపివేసిన సెక్యూరిటీ ఆఫీసర్‌ ఇప్పుడు హీరో అయ్యాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అది పోలీస్‌ పవర్‌ అంటూ అభినందిస్తున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం `టైగర్‌ 3` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కోసం బయలు దేరాడు సల్మాన్‌. రెడీ అయి తన సిబ్బందితో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్ కి వెళ్లాడు. ఎయిర్‌పోర్ట్ చేరుకున్న సల్మాన్‌ మాస్క్ పెట్టుకుని లోపలికి బయలు దేరాడు. 

గేట్‌ దగ్గరకు వెళ్లగానే ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ సల్మాన్‌ ఖాన్‌ని ఆపాడు. తనదైన స్టయిల్‌లో హుందాగా సల్మాన్‌ని ఆపాడు ఆ సెక్యూరిటీ అధికారి. తన డాక్యుమెంట్స్ చూపించమన్నాడు. దీంతో సల్మాన్‌ సిబ్బంది డాక్యుమెంట్స్ చూపించారు. ఆ సన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఇందులో నెటిజన్లు సెక్యూరిటీ ఆఫీసర్‌ని అభినందించడం విశేషం. 

View post on Instagram

ఎంత పెద్ద స్టార్‌ అయినా సెక్యూరిటీ విషయంలో ఆగిపోవాల్సిందే. అది యూనిఫామ్‌ పవర్‌. సెక్యూరిటీ ఆపిన విధానం బాగా నచ్చింది. సెక్యూరిటీ అధికారి కూడా హీరోలాగే ఉన్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇండియన్‌ టాప్‌ స్టార్‌లో ఒకరైన సల్మాన్‌ సైతం తన డాక్యుమెంట్లు చూసేందుకు సహకరించడం పట్ల ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 

ఇక ఇటీవల `రాధే` చిత్రంతో డిజాస్టర్‌ అందుకున్న సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం తనకు సూపర్‌ హిట్‌ ఇచ్చిన `టైగర్‌ జిందా హై` సీక్వెల్‌ `టైగర్‌3`లో నటిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తుంది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు సల్మాన్ `అంతిమ్‌` అనే మరో సినిమా చేస్తున్నాడు. `లాల్‌ సింగ్‌చద్దా`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నాడు.