కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై వివాదాలకు కొదవ లేదు. తరచుగా ఈ క్రేజీ హీరో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు. ఈ ఐదుపదుల బ్యాచులర్ హీరోకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవసరం లేదు. ఇటీవల సల్మాన్ ఖాన్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ముంబై వీధుల్లో డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ అయింది. 

సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం నిర్వహించింది. ఈ ఉత్సవంలో సల్మాన్ ఖాన్ డాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. 

అదే గణేష్ ఉత్సవంలో సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్లి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వివాదంగా మారాయి. ప్రముఖ దర్శకుడు అగ్నిహోత్రి తో కలసి సల్మాన్ ఖాన్ సిగరెట్ తాగడం విమర్శలకు తావిస్తోంది. గణేష్ ఉత్సవాల్లో స్మోకింగ్ ఏంటంటూ సల్మాన్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలయింది.