సల్మాన్ ఖాన్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అవి పెద్దగా వుర్కవుట్ కాకపోయినా బి,సి సెంటర్లలలో ఆయనకు ఉన్న మార్కెట్ తో లాగేస్తున్నారు. అదే కోవలో ఆయన తాజా చిత్రం సైతం తెలుగులో డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే..దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా దబాంగ్ 3 ఆ మధ్యన  ప్రారంభమైన సంగతి తెలిసిందే.  సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లో జరిగింది.  సోనాక్షి సిన్హా హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్, సౌత్ స్టార్ హీరో, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. 

‘దబాంగ్‌ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకుని రిలీజ్ చేస్తోంది.  సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్‌గా మార్చారు. డిసెంబర్‌20న ‘దబాంగ్‌ 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సల్మాన్‌.. ‘కిక్‌2’, ‘ఇన్‌షాఅల్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

ఇదిలా ఉంటె, దబాంగ్ 3 కథ ఏంటి.. దేని గురించి ఈ సినిమాలో ముఖ్యంగా ప్రస్తావించబోతున్నారు అంటే.. సల్మాన్ ఖాన్ పాత్ర గత జీవితాన్ని ను పరిచయం చేస్తూ కథ ఉంటుంది.  చుల్ బుల్ పాండే పోలీస్ ఆఫీసర్ కాకముందు,గూండాగా ఉండేవాడు. గూండా అయినప్పటికీ మంచితనం నిండి ఉంటుంది.  ల్యాండ్ మాఫియాను ఎదిరించేందుకు చుల్ బుల్ పాండే రౌడీ నుంచి పోలీస్ ఆఫీసర్ గా మారతాడు.  ఇలా పోలీస్ గా మారి ల్యాండ్ మాఫియాను ఎలా ఎదిరించాడు అన్నది కథ.  పక్కా కమర్షియల్ గా మాస్ కు నచ్చే ఫార్మాట్ లో షూట్ చేస్తున్నారట.