బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్  స్టార్ హోదా ఏ రేంజ్ లో ఉంటుందో వివాదాల డోస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. స్టార్ హోదా పెరిగిన కొద్దీ కొంచెం కొంచెంగా వివాదాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కాంట్రవర్సీ కామెంట్స్ తో అప్పుడపుడు వార్తల్లో నిలుస్తున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సంజయ్ లీలా బన్సాలి తో 20 ఏళ్ల తరువాత కలవనున్నాడు. భరత్ సినిమాతో ఈ ఈద్ కి సక్సెస్ కొట్టిన సల్మాన్ నెక్స్ట్ రంజాన్ కి సంజయ్ సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పాడు. 1999లో హమ్ దిల్ దే ఛుకె సనమ్ సినిమా అనంతరం ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయలేదు. అంతకుముందు ఈ కాంబోకి మంచి క్రేజ్ ఉండేది. 

అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ కలవలేదు, ఇకపోతే గతంలో సంజయ్ గుజారిష్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన సల్మాన్ సంజయ్ సినిమాలు చెత్తగా తీస్తున్నారంటూ కామెంట్ చేశాడు. సంజయ్ కూడా సల్మాన్ తెలివిలేని హీరో అని కౌంటర్లు కూడా ఇచ్చాడు. ఇక కాల క్రమేణా కామెంట్స్ డోస్ ఎంత పెరిగినా కొన్నిసార్లు మా ఇద్దరి మధ్య అనుబంధం ఎవరికి అర్ధం కాదని సల్మాన్ కొటేషన్ వదిలాడు. 

బాజీరావ్ మస్తానీ - పద్మావత్ సినిమాలు సంజయ్ లీలా భన్సాలీ రేంజ్ ని అమాంత పెంచేశాయి. ఆ క్రేజ్ తోనే సల్మాన్ సినిమా కూడా సింగిల్ సిట్టింగ్ లో సెట్టయ్యింది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఇన్షాఅల్లా అనే సినిమాను విడుదల చేయనున్నట్లు సల్మాన్ వివరణ ఇచ్చాడు.