Asianet News TeluguAsianet News Telugu

RRR: పోటీగా సల్మాన్!

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా RRR 2020 ఈద్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ ఉండకూడదని ముందుగానే సినిమా రిలీజ్ డేట్ జులై 30 అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పేశాడు. అయితే అదే సమయంలో ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా వాస్తు ఉంటుంది. 

SALMAN KHAN MOVIE AND RRR MOVIE RELEASE DATES CLASH
Author
Hyderabad, First Published Mar 22, 2019, 2:53 PM IST

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా RRR 2020 ఈద్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలతో పోటీ ఉండకూడదని ముందుగానే సినిమా రిలీజ్ డేట్ జులై 30 అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పేశాడు. అయితే అదే సమయంలో ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా వాస్తు ఉంటుంది. 

ఈద్ సందర్బంగా సల్మాన్ సినిమాలను వదలడం సెంటిమెంట్ గా వస్తోంది. అయితే ఈ సారి ఇన్షాల్లా అనే సినిమా రాబోతున్నట్లు అధికారికంగా చెప్పేశాడు. పద్మావత్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలియా భట్ సినిమాలో కథానాయికగా నటించనుంది. అయితే ఇప్పుడు జక్కన్న కొంచెం సందిగ్ధంలో పడ్డాడని తెలుస్తోంది. 

ఎలాంటి పెద్ద సినిమాలు లేని టైమ్ లో RRR ని ఫిక్స్ చేసుకున్నప్పటికి ఇప్పుడు అదే సమయంలో సల్మాన్ ఖాన్ సినిమా రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాను ఎలా పోస్ట్ ఫోన్ చేయించాలా అని ఆలోచిస్తున్న జక్కన్నకు ఇప్పుడు సల్మాన్ సినిమా వచ్చి టెన్షన్ పెడుతోంది. 

రామ్ చరణ్ -  తారక్ లకు సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ వస్తేనే లాభం వచ్చినట్లు లెక్క. కానీ ఇప్పుడు వేరే సినిమాలు పోటీకి దిగితే పాన్ ఇండియన్ సినిమాకు కొంత ఎఫెక్ట్ పడవచ్చు అని తెలుస్తోంది. మరి రాజమౌళి తన బడా మల్టీస్టారర్ ను ఈద్ కు వదులుతాడా లేక ఆ తరువాత రిలీజ్ చేస్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios