బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈసందర్భంగా సల్మాణ్ ఖాన్ ను మమత సాధరంగా స్వాగతించారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బాలీవుడ్ స్టార్ హీరో.. సల్మాన్ ఖాన్ కలిశారు. సీఎం మమతా అధికార నివాసానికి సాయంత్రం 4.25 గంటలకు వెళ్లిన సల్మాన్ ఖాన్ ఆమెను మర్యాదపూర్వకంగా ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్‌కు శాలువా కప్పారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఆయన కోల్‌కతా వచ్చారు. అక్కడ కార్యక్రమాలు చూసుకున్న తరువాత ఆయన ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. ఇక వారిద్దరు కలిసి ప్రజలు, మీడియాకు అభివాదం చేశారు.
దాదాపు అరగంట పాటు సల్మాన్ ఖాన్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు పలుఅంశాలమీద చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమూన బద్రతను ఏర్పాటుచేశారు. సల్మాన్ ఖాన్ కు ఉగ్రవాదుల నుంచి ప్రాణ హాని ఉండటంతో.. ఆయనకు ఇప్పటికే వై కేటగిరి బద్రతను ప్రభుత్వం అందిస్తోంది. ఇక సల్మాన్ కూడా కొంత ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కొన్నారు సల్మాన్.
మరోవైపు సీఎం మమతా బెనర్జీని నటుడు సల్మాన్ ఖాన్ కలిసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్ శతాబ్ది ఉత్సవాల కోసం సల్మాన్ తో పాటుగా.. సోనాక్షి పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ప్రభుదేవా, ఆయుశ్ శర్మ తదితరులు శుక్రవారం సాయంత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. సల్మాన్ తరువాత సోనాక్షీ సిన్హా కూడా సీఎం మమతను మర్యాదపూర్వకంగా కలిశారు.
