మాజీ లవర్ తో మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన సల్మాన్ ఖాన్, పబ్లిక్ గా ముద్దులతో...
ఈ మధ్య సినిమా వాళ్లు పబ్లిక్ గా ముద్దులు హగ్గులతో... రెచ్చిపోతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ గురించి చెప్పాలంటే..?

చుట్టు ఎవరున్నారో చూడకుండా.. ముద్దులు హగ్గులు ఇవ్వాలంటే బాలీవుడ్ వాళ్ల తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా సల్మన్ ఖాన్ అయితే.. ఇంక చెప్పనక్కర్లేదు.... ఆయన తెరమీద కంటే.. బయట చూపించే సినిమాలే ఎక్కువ. ఈక్రమంలోను మరోసారి తన రొమాంటికి పనులతో అందరికి షాక్ ఇచ్చారు సల్మాన్.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 57వ బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్ గా జరిగాయి. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ తన ఇంట్లో సల్మాన్ బర్త్ డేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్లు అందరూ విచ్చేసి సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.సల్మాన్ బర్త్ డే ఈవెంట్ లో పూజా హెగ్డే తో పాటుగా..జాన్వీకపూర్, టబు, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్స్ చాలా మంది సందడి చేశారు. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు సల్మాన్ ప్రాణ స్నేహితుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.
ఇదిలా ఉంటే.. ఈ పార్టీలో మరో అట్రాక్షన్ కూడా సందడి చేసింది. సల్మాన్ ఖాన్ మాజీ లవర్ సంగీతా బిజ్ లని కూడా ఈ పార్టీకి వచ్చింది. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆమెతో కాసేపు ముచ్చటించిన సల్మాన్ ఖాన్ సడెన్ గా ఆమెకు ముద్దు ఇచ్చాడు. అయితే అది ఆమె నుదుటిపై మాత్రమే సల్మాన్ ముద్దు పెట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈ విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా చూసి షాక్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికీ ఫ్రెష్ లవర్స్ మాదిరిగానే వీరిద్దరు మాట్లాడుకోవడం వైరల్ న్యూస్ గా మారిపోయింది. ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే... సంగీత వెళ్తున్నప్పుడు కూడా సంగీత కారు డోర్ తీసి మరీ ఆమెను సాగనంపాడట సల్మాన్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.