స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంకా సినిమా మొదలుపెట్టకముందే బాలీవుడ్ లో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అభిమానుల్లో కూడా సల్మాన్ సినిమాకు సంబందించిన పుకార్లు చర్చనీయాశంగా మారాయి. ప్రతి ఏడాది ఈద్ కానుకగా ఎదో ఒక సినిమాను విడుదల చేసే సల్మాన్ ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తాడు? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. 

అసలైతే సల్మాన్  సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో చేయనున్న ఇన్షా - అల్లా అనే సినిమాను నెక్స్ట్ ఈద్ కి రెడీ చేయాలనీ అనుకున్నారు. కానీ సినిమా మేకింగ్ కు సమయం సరిపోదు. ఆ సినిమాను. వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు సల్మాన్ చేతిలో ఉన్నది ఒకే ఒక్క ఆయుధం కిక్ 2. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా కాలమవుతోంది. దర్శకుడు సాజిద్ ఇప్పటికే ఒక కాన్సెప్ట్ ని కూడా రెడీ చేసుకొని రచయితలతో కథను అల్లిస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి రంజాన్ కానుకగా విడుదల చేస్తే బావుంటుందని సల్మాన్ ఆలోచించినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే స్పెషల్ ఎనౌన్సమెంట్ రానున్నట్లు టాక్ వస్తోంది. ఇకపోతే సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా డైరెక్షన్ లో దబాంగ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.