బాలీవుడ్ బాయ్ జాన్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సూర్యుడి వేడిని తట్టుకోలేక ఓ మినీ లేక్ లో చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్ తన అభిమానులతో పంచుకున్నాడు.

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన జిమ్ చిత్రాలతో, సిక్స్ ప్యాక్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటారు. తన టోన్డ్ బాడీని చూపిస్తూ అభిమానులకు ట్రీట్ చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల తను సీక్రెట్ గా హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)తో పెళ్లి చేసుకున్నాడంటూ ఓ పిక్ వైరల్ గా మారింది. అయితే దానిపై సోనాక్షి సిన్హా వెంటనే స్పందించి, అదంతా రూమరే అంటూ తేల్చి చెప్పడంతో నెటిజన్లు కాస్తా చల్లబడ్డారు. ఆ తర్వాత సల్లూ బాయ్ కూడా ఓ వీడియో షేర్ చేస్తూ ‘షాదీ హో గహి’ అనడంతో మళ్లీ అందరూ షాక్ కు గురయ్యాడు. కానీ అది ఓ యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన క్లిప్ అని తెలియడంతో.. బాయ్ జాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ కామెంట్లతో ఆ కథను ముగించారు. 

అయితే, సమ్మర్ హీట్ మొదలైంది. ఇప్పటికే ఎండలు దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ తో దంచుతున్నాయి. కాగా ఈ ఎండ వేడిని నుంచి చల్లదనాన్ని ఆస్వాదించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సల్లూ బాయ్ శనివారం మధ్యాహ్నం ఓ మినీ లేక్ లో దాక్కున్నాడు. నీటి మధ్యలో హ్యాట్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నాడు. ప్రశాంతంగా నీటిలో తేలుతున్న పులిలా కనిపిస్తున్నాడు. ఈ పిక్ ను తన అభిమానులతో పంచుకుంటూ.. ‘యార్.. ఎవరైనా ఇంత అందంగా ఎలా ఉండగలరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సల్లూ బాయ్ ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పిక్ ను షేర్ చేసిన కొన్ని మూడు గంటల్లోనే కోటీ లైక్ లను దక్కించుకోవడం విశేషం. 

ఇదిలా ఉంటే, సల్మాన్, కత్రినా కైఫ్‌ (Katrina Kaif) కలిసి నటిస్తున్న చిత్రం 'టైగర్ 3' (Tiger 3). ఈ చిత్రం భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ నుంచి ఓ అత్యద్భుతమైన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ 2023 ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. హిందీ, తమిళం మరియు తెలుగులో విడుదల కానుంది.

View post on Instagram