Salman Khan Health Update: నిలకడగానే సల్మాన్ ఆరోగ్యం.. ఊపిరి పీల్చుకున్న అభిమానులు..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కాటేసిన సంగతి తెలిసిందే... బాలీవుడ్ తో పాటు సల్మాన్ ఫ్యాన్స్ కు దిగ్బ్రాంతి కలిగించిందీ న్యూస్.. ఇప్పుడు సల్మాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి.. ప్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కాటేసింది. బాలీవుడ్ తో పాటు సల్మాన్ ఫ్యాన్స్ ను దిగ్బ్రాంతి కలిగించిందీ న్యూస్. పాము కాటు వేయడంతో వెంటనే సల్మాన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. ఇమీడియట్ గా ట్రీట్ మెంట్ అందించారు డాక్టర్స్. ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ తన ఈవెంట్స్ కు సంబంధించిన పనులు పూర్తి చేసుకుని.. పన్వెల్ ఫాంహౌస్‌కు వెళ్ళారు. అక్కడ ఉన్న సమయంలో ఆయనను పాము కాటు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ పాము విషం లేని పాము కావడంతో..కాటు వేసినా ప్రమాదం ఏమీ జరగలేదు. కాని కాటు వేసిన వెంటనే క్లారిటీ లేకపోవడంతో.. ఏం జరుగుతుందా అన్న భయంతో.. వెంటనే సల్మాన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సల్మాన్ ను కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందించారు.
సల్మాన్ ఖాన్‌ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయనకు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అంతే కాదు ఈ రోజు( డిసెంబర్ 26) ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా చేశారు. సల్మాన్ చేతి భాగంలో పాము కాటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్ 15’ షూటింగ్ రన్నింగ్ లో ఉంది. ఈ ప్రోగ్రామ్ తాజా ఎపిసోడ్ లో ట్రిపుల్ ఆర్ టీమ్ సందడి చేయబోతున్నారు. ఈరోజు రాత్రి ఆ ప్రోగ్రాం ప్రసారం కానుంది.
Also Read : Mega Familly: ఒకే ఫ్రేమ్ లో మెగా హీరోలు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్...
సల్మాన్ కు పాము కాటు వేసిందని తెలిసి అభిమానులు ఆందోళన పడ్డారు. క్షణాల్లోనే వార్త వైరల్ అవ్వడంతో తమ అభిమాన స్టార్ ఎలా ఉన్నడా అని.. ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు. సల్మాన్ ఎక్కడున్నాడో తెలిస్తే.. వెళ్ళి చూసిరావాలని చాలామంది అభిమానులు ట్రై చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు సల్మాన్ ను పాము కరిచిందని తెలిసి బాలీవుడ్ కూడా షాక్ కు గురైంది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కోక్కరుగా ఆయన్ను ఫోన్ లో పరామర్షిస్తున్నారు.