భారత్ సినిమాతో ఇటీవల ఈద్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో దబాంగ్ 3ని వదలనున్నట్లు సల్మాన్ బాక్స్ ఆఫీస్ కి హెచ్చరిక జారీ చేశాడు. 

గతంలో వరుస అపజయాలతో సతమతమవుతున్న వేల దబాంగ్  సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తరువాత అదే తరహాలో సీక్వెల్ కూడా చేసి తన మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు మూడవసారి అదే తరహాలో రెడీ అవుతున్నాడు. దబాంగ్ 3 సినిమాను 2019 డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. 

ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పోకిరి రీమేక్ వాంటెడ్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో బాలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. అలాగే కన్నడ తెలుగు తమిళ్ మళయాలం భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ రాజస్థాన్ లో పలు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడంలో బిజీగా ఉంది.