సల్మాన్‌ తిరిగి ప్రయాణమైన సమయంలో   ఆయన్ని చూసి ‘సల్లూ భాయ్‌’, ‘భాయ్‌’ ‘సల్మాన్‌’ అంటూ కేకలు వేస్తూ ఆయన్ని చుట్టుముట్టారు.  

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ అభిమానుల్లో ఉన్న క్రేజ్  సంగతి తెలిసిందే. ఆయనకు దేశ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఆయన అంటే ప్రాణం ఇచ్చేందుకు కూడా వెనకాడం అన్నట్లు తిరుగుతూంటారు. ముఖ్యంగా ఈ పెళ్లి కాని బ్రహ్మచారికి మహిళా అభిమానులు అధికం. సల్మాన్ ఈవెంట్స్ లో వాళ్లు చేసే రచ్చ ఏ రేంజిలో ఉంటూంటుంది. ఆయన్ని కలవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటారు.  అయితే సల్మాన్ మాత్రం జన సమూహాలకు వీలైనంత దూరంగా ఉంటూంటారు.  బహిరంగప్రదేశాల్లోనూ అరుదుగా దర్శనమిస్తుంటారు. మహిళలతో వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూంటారు.

 ఇది ప్రక్కన పెడితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మిడిల్ ఈస్ట్ లో  పర్యటిస్తున్నారు. అక్కడ షోలు చేస్తున్నారు. ఇలాంటి ఓ షో జరుగుతున్న టైమ్ లో  ఓ మహిళా అభిమాని ముందుకు తీసుకొచ్చింది. ఆమె తన ఛాతిని తీసి అక్కడ సల్మాన్ tattoo ని చూపెట్టింది. తను సల్మాన్ ని కలుస్తానని వదలమని సెక్యూరిటీని కోరింది. కుదరదంటే ఏడవటం మొదలెట్టింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మీరూ ఓ లుక్కేయండి.

View post on Instagram
 

ఇక ఆ మధ్య  ఆయన ముంబయి వీధుల్లో సందడి చేశారు. తన స్నేహితులతో కలిసి జూహులోని ఓ ప్రముఖ ఆస్ట్రేలియన్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్‌ వద్దకు చేరుకొన్నారు. సల్మాన్‌ తిరిగి ప్రయాణమైన సమయంలో రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తోన్న ఆయన్ని చూసి ‘సల్లూ భాయ్‌’, ‘భాయ్‌’ ‘సల్మాన్‌’ అంటూ కేకలు వేస్తూ ఆయన్ని చుట్టుముట్టారు.

తమ కెమెరాలతో ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో చిన్న తోపులాట చోటు చేసుకొంది. అనంతరం సల్మాన్‌.. తన వ్యక్తిగత సిబ్బందిసాయంతో కారులోకి ప్రవేశించి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ‘టైగర్‌-3’, ‘పఠాన్‌’ చిత్రాలున్నాయి.