బాలీవుడ్ స్వరదిగ్గజం, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల సినీ పరిశ్రమల నుంచి ఇంకా నివాళులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, ఎస్ఎస్ రాజమౌళి, బాలక్రిష్ణ, కీర్తిసురేష్ లతాజీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
సల్లూ భాయ్ లతాజీ మరణం పట్ల చాలా భాదపడుతున్నారు. ‘లతాజీ హా నైటింగేల్ గా ఉండకపోవచ్చు.. కానీ మీ వాయిస్ ఎప్పుడూ మాతోనే ఉంటుంది’ అంటూ భాయ్ జాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో లతా మంగేష్కర్ తో ఓ కార్యక్రమ వేదికపై తను ఉన్న ఫొటోను పోస్ట్ చేసి నివాళి అర్పించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ( Chirajivi) కూడా లతాజీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్ లతా దీదీ ఇక లేరనే విషయం తట్టుకోలేకపోతున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపీ అందనంత ఎత్తుకు ఎదిగింది. ఫలితంగా ఆమె సజీవంగా లేకున్నా ఆమె సంగీతం సజీవంగానే ఉంటుంది. రెస్ట్ ఇన్ పీస్ లతామంగేష్కర్ ’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక దర్శకధీరుడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడ లతాజీ మరణ వార్త వినగా చలించిపోయాడు. ట్విట్టర్ వేదికన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘లతాజీ మరణం తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటుంది. భారతదేశపు నైటింగేల్‌కు నా హృదయపూర్వక నివాళి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ‘భారతదేశ నైటింగేల్, లతా జీ మరణం గురించి వినడానికి హృదయం ఒప్పుకోవడం లేదు. ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. భారతీయ సినిమా ఒక స్వర రత్నాన్ని కోల్పోయింది. కానీ ఆమె తన సంగీతం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది.
అలాగే నందమూరి బాలక్రిష్ణ కూడా లతా మంగేష్కర్ మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. ఈ మేరకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు, ఇందుకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనం.. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు..
భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే...అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయంటూ గుర్తు చేశాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. లతాజీ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు దేవీ శ్రీ ప్రసాద్ (DSP). ‘భారత నైటింగేల్ లతా మంగేష్కర్ మరణం చాలా బాధాకరం. ఆమె మధుర గానంతో మా అందరికీ ప్రశాంతతను అందించింది. ఆమెలాంటి వారు మరోకరు ఉండబోరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులు లతాజీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
