బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి జోధ్ పుర్ కోర్టు మరోసారి షాకిచ్చింది. సమన్లు జారీ చేస్తూ వెంటనే కృష్ణ జింకను వేటాడిన కేసు విచారణపై హాజరు కావాలని ఆదేశించారు. లేదంటే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు తెలిపింది. 

1998లో హమ్ సాథ్ సాథ్ హైన్ షూటింగ్ జరుగుతుండగా బ్రేక్ లో సల్మాన్ జింకను వేటాడినట్లు కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. 2007లో జోధ్ పూర్ జైల్లో సల్మాన్ వారం రోజులు ఉన్నాడు. ఈ కేసు విషయంపై కోర్టు మరోసారి విచారణకు ఆదేశించింది.