బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను (Salman Khan) పాము కాటువేసింది. ముంబై పన్వెలోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు (snake bite) గురైన సల్మాన్‌ ఖాన్‌ వెంటనే నవీ ముంబై కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను (Salman Khan) పాము కాటువేసింది. ముంబై పన్వెలోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో (farmhouse in Panvel) శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు (snake bite) గురైన సల్మాన్‌ ఖాన్‌ వెంటనే నవీ ముంబై కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు పరీక్షించిన వైద్యులు ప్రమాదం ఏమి లేదని తేల్చారు. అతను ఇంటికి తిరిగి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ఆదివారం ఉదయం 9 గంటలకు సల్మాన్ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే సల్మాన్‌ ఖాన్ కాటు వేసిన పాము విషపూరితం కానిదని తెలుస్తోంది. 

అయితే సల్మాన్ ఖాన్‌ పాము కాటుకు గురయ్యారనే వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక, డిసెంబర్ 27వ తేదీన సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆయన 56 వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 15 హోస్ట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలను హౌస్‌ మేట్స్ సెలబ్రేట్ చేశారు. ఈ వీకెండ్ వార్ ఎపిసోడ్‌లో ఆర్ఆర్‌ఆర్ టీమ్ సందడి చేసింది రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, ఆలియా భట్ ఈ షోలో కనిపించారు. వీరు కూడా బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకల్లో పాలుపంచుకున్నారు.