బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన మరో భారీ బడ్జెట్ చిత్రం భారత్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. సినిమా ప్రీమియర్స్ షోలతో మొదటి రోజే మంచి బజ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ సోషల్ మీడియాలో మరో టాక్ మొదలైంది. 

ఇక క్రిటిక్స్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూలు అందుతున్నాయి. ఎమోషనల్ గా సాగే ఈ కథ తప్పకుండా ఆడియెన్స్ మనసును దోచేస్తుందని ప్రముఖ సినీ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తెలిపారు. అదే విధంగా భారత్ సినిమాకు 4 స్టార్స్ ఇచ్చి సల్మాన్ - కత్రినా నటన అద్భుతంగా ఉందని ముఖ్యంగా సల్మాన్ కు ఈ సినిమా లైఫ్ లైన్ అని వివరణ ఇచ్చారు. 

దర్శకుడు అలీ అబ్భాస్ మేకింగ్ స్టైల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అన్నారు. 100కోట్ల బడ్జెట్ తో రుపొందిన భారత్ సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగు వేలకు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ అయ్యింది. సల్మాన్ కెరీర్ లో ఇదొక రికార్డ్. మొదటి రోజు సినిమా 45కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పండితులు చెబుతున్నారు.