Asianet News TeluguAsianet News Telugu

గాడ్ ఫాదర్ టీమ్ పై మండిపడుతున్న సల్మాన్ ఖాన్, పరువంతా తీశారంటూ...?

మెగాటీమ్ పై మస్త్ కోపంగ ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మండిపడుతున్నాడట. ఇంతకీ ఆయనకు ఎందుకు కోసం వచ్చింది...? 

Salman Khan Angry on Godfather teame
Author
First Published Sep 19, 2022, 3:39 PM IST

మెగాటీమ్ పై మస్త్ కోపంగ ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మండిపడుతున్నాడట. ఇంతకీ ఆయనకు ఎందుకు కోసం వచ్చింది...? 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన  సినమా  గాడ్ ఫాదర్. ఈ  సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.  మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్  నటించారు.  సల్మాన్ నటించడంతో ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారని ప్రచారం జరిగింది. 
 అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే ఛాన్స్ లేనట్టే తెలుస్తోంది. గాడ్ ఫాదర్ విషయంలో సల్మాన్ ఖాన్ చాలా కోపంగా ఉన్నారట. అందుకు కారణం సల్మాన్ ఖాన్ సినిమా యొక్క అవుట్ ఫుట్ విషయంలో తీవ్రంగా నిరాశతో ఉన్నాడట. తన లుక్ తోొ పాటు... సినిమాలో తన  సన్నివేశాలు మరియు ఇతర నటీ నటులు సన్నివేశాలు కూడా సినిమా కి ఏమాత్రం బాగోలేవు అన్నట్లుగా సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారట. 

అంతే కాదు ఇదేం సినిమా.. నా పాత్ర ఎందుకు ఇలా చేసారంటూ ఆయన కోపగించుకున్నట్టు వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నటించినందుకు తన పరువు పోయేలా ఉందంటూ.. ఆయన తన సన్నిహితుల దగ్గర అంటున్నారట. స్నేహితుల వద్ద సల్మాన్ ఖాన్ ఖరాకండీగా చెప్పేశాడట. అంతే కాదు పొరటాపాటున కూడా హిందీలో ఈ సినిమా రిలీజ్ చేయవద్దంటూ సన్మాన్ సలహా కూడా ఇచ్చినట్టు చెపుతున్నారు. ఈ విషయాన్ని ఆయన నిర్మాతలకు సూచించాడట. 

గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చిరంజీవి - సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటు సినిమా టమ్ కూడా గాడ్ ఫాదర్ ను హిందీలో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ సాధించవచ్చు అనుకున్నారు..ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మరియు ఆయన సినిమా పై పెట్టుకున్న అభిప్రాయంతో ఇండస్ట్రీ వర్గాల వారు షాక్ అవుతారు. మొన్నటి వరకు అనంతపురంలో జరగబోతున్న గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చారు.

కాని సల్మాన్ బద్రత విషయంలో సమస్యలు ఎదురవుతాయని ఆయన పాల్గొనే అవకాశం లేదంటూ తేలడంతో సల్మాన్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.  మరో వైపు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో కోపంగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోడంపై మండిపడుతున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios