బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిత్యం పోటీపడే షారుక్ - సల్మాన్ ఒక చోట కలిసారు అంటే ఆ రోజు పార్టీ మాములుగా ఉండదు. ఇకపోతే రీసెంట్ గా ఈ సీనియర్ హీరోలు మరోసారి కలుసుకొని అందరిని ఆకర్షించారు. అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సల్మాన్ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు చెప్పాడు. 

అది చూసిన నెటిజన్స్ వీళ్ళ ఎమోషనల్ సెంటిమెంట్స్ మాములుగా లేవని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 1995లో రాకేష్ రోషన్ దర్శకత్వంలో  షారుక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ కలిసి నటించిన చిత్రం కరణ్ అర్జున్. ఆ సినిమా తనకు ఎప్పటికైనా బెస్ట్ మూవీ అంటూ చెప్పే సల్మాన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 

రీసెంట్ గా కలుసుకున్న ఈ స్టార్ సెలబ్రెటీలు అందులో ఎమోషనల్ సాంగ్ ను చూస్తూ ప్రేమతో హద్దుకున్నారు. ఇటీవల విడుదలైన షారుక్ జీరో సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ లో అలరించాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సల్మాన్ రేస్ 3 కూడా ఈ ఏడాది ప్లాప్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది.