అంబాని వారి పెళ్ళి ఈవెంట్ లో తారాతోరణం మెరుపులు మెరిసింది. బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ కూడా ఈ వెంట్స్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఖాన్ త్రయం చేసిన నాటు డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  

ఇండియన్ బిజినెస్ దిగ్గజం, వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి అందరికి తెలిసిందే.. దేశం అంతా నివ్వెర పోయేలా.. అంబానివారి వారసుడు అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అంబాని చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం మరికొన్ని రోజుల్లో జరగనుంది. గుజరాత్ లోని జామ్ నగర్‏లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరు అవుతున్నారు. 

ఈ వేడుకలకు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రెటీస్ హజరయ్యారు. ఫిబ్రవరి 28 నుంచే ప్రీ వెడ్డిండ్ వేడుకలు స్టార్ట్ అవ్వగా... మార్చి 1 నుంచి ప్రముఖుల తాకిడి పెరిగింది. ఈరోజుతో ఈ వేడుకులు ముగియబోతున్నాయి. కాగా పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనతో ఊర్రూతలూగించగా.. ఆమెకు కోట్లలో రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది. రిహన్నా ఫస్ట్ టైమ్ ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం విశేషం. అంతే కాదు అంబాని సంగీత్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్స్ ల‏తో సందడి చేశారు. ఈ వేడుకలలో మరోసారి ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ మారుమోగింది. 

Scroll to load tweet…

ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఖాన్ త్రయం. వేదికపై బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లు సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ చేసి కనులవిందు చేశారు. చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్ పై ముగ్గురు కనిపించడం ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేయగా.. వీరు ముగ్గురు కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది ప్యాన్స్ కు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టేప్ ను మార్చేసి కాసేపు నవ్వులు పూయించాడు సల్మాన్.