కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, ఛాక్లెట్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ కలిసి మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు. వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి `మైనే ప్యార్‌ క్యున్‌ కియా`, `పార్ట్నర్‌`, `యువరాజ్‌`, `ఏక్‌ ది టైగర్‌`, `టైగర్‌ జిందా హై` చిత్రాల్లో నటించారు. దాదాపు అన్ని సినిమాలు మంచి ఆదరణ పొందాయి. 

ఇప్పుడు ముచ్చటగా ఆరోసారి కలిసి ఆడిపాడబోతున్నారు. `టైగర్‌` సిరీస్‌లో భాగంగా త్వరలో రాబోతున్న సినిమాలో మరోసారి డ్యూయెట్లు పాడబోతున్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఈ మూడో టైగర్‌ రూపొందుతుండగా, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో, భారీ యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రంతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని డిసైడ్‌ అయ్యిందట ఈ క్రేజీ అండ్‌ మాజీ లవ్‌ బర్ద్స్.

ప్రస్తుతం కత్రినా అక్షయ్‌తో `సూర్యవంశీ`లో నటించగా, అది విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `ఫోన్‌బూత్‌` అనే మరో సినిమా చేస్తుంది. ఇక సల్మాన్‌ `రాధే` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `అంతిమ్‌` అనే మరో సినిమాలో నటిస్తున్నారు. వీటితోపాటు `బిగ్‌బాస్‌ 14`కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడో టైగర్‌ చిత్రం మార్చిలో ప్రారంభించి వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల చేయాలని భావిస్తున్నారు.